Sunday, May 5, 2024

Micro Donation: మైక్రో డొనేషన్ కార్యక్రమం.. మోదీ విరాళం ఎంతంటే..

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి పురస్కరించుకుని నిన్న(డిసెంబర్ 25) బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘మైక్రో డొనేషన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పార్టీలో ప్రతి వ్యక్తి కచ్చితంగా కనిష్టం రూ.5 రూపాయల నుంచి గరిష్టంగా వేయి రూపాయల వరకూ విరాళాలు స్వీకరిస్తారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి రోజైన ఫిబ్రవరి 11 వరకూ ఈ విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగనుంది. మైక్రో డొనేషన్స్ కార్యక్రమానికి ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ వేయి రూపాయలు విరాళమిచ్చారు. ఆ విరాళానికి సంబంధించిన రసీదును తీసుకున్నారు. దాతలు రూ. 5, రూ. 50, రూ. 100, రూ. 500 లేదా రూ. 1,000 సహకార ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు బీజేపీ నేతలు విరాళాలు అందించి, ఇతరులను సహకరించాలని కోరారు.

”నేను భారతీయ జనతా పార్టీ ఫండ్ కోసం వేయి రూపాయలు విరాళమిచ్చారు. ఎప్పుడూ దేశానికి మొదటి స్థానమివ్వాలనేదే నా కోరిక. మా కార్యకర్తల ద్వారా జీవితాంతం నిస్వార్ధ సేవ చేసే సంస్కృతి..మీరిచ్చే మైక్రో డొనేషన్ ద్వారా సాధ్యమవుతుంది. బీజేపీని బలోపేతం చేయండి. దేశాన్ని బలోపేతం చేయండి” అని మోదీ ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement