Sunday, May 5, 2024

బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా

బిహార్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం బుధవారం శాసనసభలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందే శాసనసభ సభాపతి విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాను తన పదవికి రాజీనామా సమర్పించి ఉండేవాడినని, అయితే తనపై కొందరు తీవ్రమైన ఆరోపణలు చేసినందువల్ల సభలో తన వాదనను వినిపించాలనుకున్నానని తెలిపారు.

తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా ఉందని, నిబంధనలకు అనుగుణంగా లేదని విజయ్ కుమార్ తెలిపారు. తొమ్మిది మంది ఇచ్చిన లేఖల్లో ఎనిమిది లేఖలు నిబంధనలకు అనుగుణంగా లేవన్నారు. తాను పక్షపాతంతో, నియంతృత్వంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారని, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తప్పు అని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement