Saturday, May 4, 2024

బిగ్ బాస్ లో సింగర్ రేవంత్.. విన్నర్ అని ముందుగానే సంబ‌రాలు.. కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన త‌ల్లి

బిగ్ బాస్ లో సింగ‌ర్ రేవంత్ ని విన్న‌ర్ చేసినందుకు ముందుగానే ధ‌న్య‌వాదాలు తెలిపారు రేవంత్ త‌ల్లి సీత సుబ్బలక్ష్మి.. ఆమె మాట్లాడుతూ. మా వాడిని విన్నర్ ను చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.. రేవంత్ ట్రోఫీ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో నాకు ఆకలి కూడా వేయడం లేదు.. ఇలాంటి కొడుకు జన్మజన్మలకి నా కడుపున పుట్టాలని కోరుకుంటున్నాను. పూజలు కూడా చేస్తున్నాను”.. అంటూ ఎమోషనల్ అయింది సీతా సుబ్బలక్ష్మి. అయితే సీత సుబ్బలక్ష్మి ఫ్యామిలీ వీక్ లో భాగంగా రేవంత్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తన అమాయకత్వంతో అందరిని ఆకట్టుకుంది.

అంతేకాదు రేవంత్ పై ఉన్న నెగిటివిటీ ని కూడా ఆమె చాలా వరకు తగ్గించింది. మొత్తానికైతే కొడుకు టైటిల్ విన్నర్ అని తెలిసి ఆ తల్లి సంతోషానికి అవధులు లేవని చెప్పవచ్చు.బిగ్ బాస్ సీజన్ 6 ఎమోషనల్ గా పూర్తవబోతోంది అని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 25వ రోజే తనను అవమానిస్తున్నారని తలచిన రేవంత్.. “నవ్వండి బ్రో.. ఎవరెంత నవ్వుతారో నవ్వండి.. రేపటి రోజున బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ ని నేను ఇలా నా చేతులతో పట్టుకున్నప్పుడు.. మీ నవ్వులు ఏమవుతాయో చూస్తాను అంటూ రేవంత్ అన్న మాట సరిగ్గా 106 రోజుల తర్వాత ఇదే నిజం కాబోతోంది. అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ అని తెలియడంతో ఇప్పటినుంచి వారి ఇంటి వద్ద సంబరాలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement