Tuesday, April 30, 2024

ఓటీటీలో బిగ్ బాస్ – ప్రోమో రిలీజ్ – నాగార్జున‌కి ముద్దుపెట్టిందిఎవ‌రో

నేటి నుండే ఓటీటీలో ప్ర‌సారం కానుంది బిగ్ బాస్. దాంతో కంటెస్టెంట్స్ ని క‌నిపించి..క‌నిపించ‌కుండా ప‌రిచ‌యం చేశారు హీరో నాగార్జున‌. కొందరు లేడీ కంటెస్టెంట్స్ తో లాంచ్ ఈవెంట్ లో నాగార్జునతో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఓ లేడీ కంటెస్టెంట్ నాగార్జున బుగ్గపై ముద్దు పెట్టడం విశేషం. ఆ లేడీ కంటెస్టెంట్ లిప్ స్టిక్ ముద్ర నాగ్ బుగ్గపై అలానే ఉండిపోయింది. అయితే ముద్దు పెట్టిన ఆ కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే సాయంత్రం లాంచింగ్ ఈవెంట్ చూడాల్సిందే. ఇక బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. వీరిలో మొమైత్ ఖాన్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఉన్నారు.

ప్రోమో ద్వారా ఈ విషయం అర్థమవుతుంది. వీరిద్దరూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కావడం విశేషం. వీరితో పాటు అఖిల్, యూట్యూబ్ యాంకర్ శివ, ఆషురెడ్డి, అరియానా తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్తగా మరికొందరు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొంటున్నారు. కాగా బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ రెగ్యులర్ బిగ్ బాస్ షోకి చాలా భిన్నం. ఇది 24/7 ప్రసారం కానుంది. అంటే ప్రతి నిమిషం కంటెస్టెంట్స్ గేమ్ లో భాగంగా ఉంటారు. గేమ్స్, టాస్క్ విషయంలో మాత్రం పోలిక ఉంటుంది. ఇక బిగ్ బాస్ ఓటిటి వర్షన్ కి పరిమితులు తక్కువ. అంటే రొమాన్స్ పాళ్ళు ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలోనే కంటెస్టెంట్స్ ఓ రేంజ్ రొమాన్స్ కురిపిస్తున్నారు. ఇది ఓటీటీ కాబట్టి అడల్ట్ కంటెంట్ పరిమితులు దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం 6 గంటల నుండి బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రసారం కానుంది.

https://www.youtube.com/watch?v=iL3GoVqZIsk&t=1s

Advertisement

తాజా వార్తలు

Advertisement