Sunday, May 5, 2024

‘బిగ్ బాస్6’కి నేనే హోస్ట్ – నాగార్జున‌

బుల్లితెర‌పై అన్ స్టాప‌బుల్ అంటూ సంద‌డి చేస్తున్నారు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. త‌న‌దైనశైలిలో దూసుకుపోతున్నారు. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్6కి హోస్ట్ గా బాల‌కృష్ణ చేయ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌కి చెక్ పెట్టారు హీరో నాగార్జున‌. డిస్నీ హాట్ స్టార్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ అనేది నాలెడ్జ్ గేమ్.. 15 మంది మైండ్ సెట్‌తో జర్నీ చేయాలి.. వాళ్లు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు.. అదో గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం.

ఒకవారం బాగున్నాడు అనుకున్న కంటెస్టెంట్స్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మారిపోతుంటాడు. వాళ్ల నుంచి చాలా నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ సీజన్ కూడా నేనే హోస్ట్ చేయబోతున్నాను అని క్లారిటీ ఇచ్చారు. సీజన్ 6కి హోస్ట్ మీరేనా? అని విలేకరులు అడగడంతో.. నేను హోస్ట్ చేస్తున్నానంటూ.. పక్కనే ఉన్న స్టార్ మా నెట్ వర్క్ బిజినెస్ హెడ్‌ని నేనే కదా అని చమత్కరించారు నాగార్జున. మొత్తానికి బిగ్ బాస్ 6 హోస్ట్ తానే అని నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో.. బాల‌కృష్ణ బిగ్ బాస్6కి హోస్ట్ కాద‌న్న సంగ‌తిని తేల్చి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement