Friday, April 26, 2024

Big Story: అన్ని నదులు ఒకెలా ఉండవు.. ఈ నది నీళ్లు సలసల మరిగిపోతుంటయ్..

సలసలకాగే నది.. ఎప్పుడైనా విన్నారా.. ఎక్కడైనా చూశారా? ఇంతవరకు కనీ, వినీ ఎరుగని ఓ వింత నది గురించి ఇప్పుడు డిటేయిల్డ్ గా చదివి తెలుసుకుందాం..

పెరువియాన్ అమెజాన్ నడి బొడ్డున ఈ అబ్బురపరిచే నది ఉంది. ఇది ఒక అసాధారణమైనది, ఇది అందరినీ కలవరపరిచే విషయం కూడా. ఎందుకంటే ఈ నది అన్ని నదుల్లా ఉండదు. చెరువులు, నదుల గురించి మనందరికీ తెలిసిందే. వాటిలో పారే పారే నీళ్లంటే.. చల్లగా ఉంటాయని, స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చని అందరూ అనుకుంటారు. కానీ, ఈ రివర్ వాటర్ అట్లాంటి ఇట్లాంటి వాటర్ కాదు. 80 డిగ్రీల సెల్సీయస్ లో మంటపెట్టి మరిగించినట్టు నిరంతరం సలసలమని మరిగిపోతూనే ఉంటాయి నీళ్లు. అవును.. ఈ రివర్ వాటర్ నిరంతరం మరుగుతూనే ఉంటుంది. బుస బుసమని పొగలు కక్కతూ ప్రవహిస్తుంది.

ఒకప్పుడు జానపథ కథలు, తన తాత చెప్పే సరదా స్టోరీస్ విన్న ఓ స్టూడెంట్ నిజంగా ఇట్లాంటి నది ఉంటుందా అని చిన్నప్పటి నుంచి ఆలోచన చేసేవాడు. అతనితోపాటే తన ఆలోచన కూడా పెరగి పెద్దదైంది. తను పీహెచ్ డీ చేస్తుండగా జియాలజిస్టుగా ఈ అంశాన్నే ఎంచుకున్నాడు. అతనే సదరన్ మెథడిస్ట్ విశ్వ విద్యాలయానికి చెందిన జియో ఫిజిసిస్ట్ అడ్రెస్ రూజో. అంతేకాదు ఆ జలమార్గాన్ని కనుగొనేందుకు తన ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు.

ఈ విస్మసయపరిచే నది విషయంలో రూజో ‘‘ది బాయిలింగ్ రివర్ , అడ్వెంచర్ అండ్ డిస్కవరీ ఇన్ ద అమెజాన్’’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. నది గురించి నిర్ఘాంతపరిచే చాలా విషయాలు ఆ బుక్ లో పొందుపరిచారు. ఆ నదిలో నీళ్లు కూడా 80 డిగ్రీల సెల్సియస్‌లో సలసలమని కాగుతుంటాయని పేర్కొన్నాడు.

బాల్యంలో ఉన్నప్పుడు తన తాతయ్య నోటి వెంట ఈ నది గురించి విన్నాడట. కానీ, ఆయన కూడా ఎప్పుడూ ఆ నదిని చూడలేదు. ఆ నదిని చూశాక కానీ తనకు అసలు విషయం తెలియలేదని.. మతిపోయిందని అంటున్నాడు రూజో. ‘‘ఈ నది నీళ్లు ఎప్పుడూ సలసలమని కాగుతుంటాయి. అదే ఈ నది పరిస్థితి. ఇవి ఎందుకలా సలసలా కాగుతున్నానేది  ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధించలేకపోయారు. ఈ నదిని చూసి జియోలజిస్టులకు మతిపోయింది. అని తెలిపాడు రూజో.

- Advertisement -

‘‘నేను పెద్దయ్యేదాకా తాతయ్య చెప్పిన సలసలకాగే నది ఎట్లుంటుందో అనే విషయాలే వెంటాడేవి. అసలది ఎలా సాధ్యమనే ప్రశ్నే ప్రతిసారీ వేధించేది. తోటి విద్యార్దులు, సహచరులే కాకుండా ఆయిల్, గ్యాస్ కంపెనీలను కూడా సంప్రదించాను. కానీ, ఎవరూ దీని విషయం చెప్పలేకపోయారు. ఆ నది పరిసరాల్లో కూడా ఏ విధమైన వోల్కనో కూడా లేదు’’ అని తెలిపారు రూజో.

ఈ నదిలో పొరపాటున ఎవరైనా పడితే.. ఇక సజీవంగా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఒళ్లంతా వేడి నీటిలో ఉడికిపోయి మరణం సంభవించడం ఖాయం. అమెజాన్ అడవుల్లోని పెరూలో ఈ నది ప్రవహిస్తుంది. ఈ నది పేరు మయాన్‌త్యుయాకు (Mayantuyacu River). ఎంతో మంది జియాలజిస్టులు ఈ నదిపై పరిశోధన జరిపారు. కానీ, నీళ్లు మరిగేందుకు గల కారణాలను మాత్రం తెలుసుకోలేకపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha  #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement