Monday, April 29, 2024

‘భీమ్లా నాయ‌క్’ టైటిల్ సాంగ్ లోడింగ్ – పోస్టర్ రిలీజ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న చిత్రాల్లో భీమ్లా నాయ‌క్ ఒక‌టి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.. ఇక ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తార‌నే విష‌యంపై ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్​.. సోమవారం(ఫిబ్రవరి 14) జరగనుంద‌ట‌. ఆ తర్వాత రిలీజ్ డేట్​పై క్లారిటీ వచ్చే అవకాశముంది. ముందే చెప్పినట్లు ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రావడం దాదాపు ఖాయమైయింద‌ట‌. ఇక ఏపీలోని ‘సినీ’ సమస్యలు పరిష్కారమయ్యేలా కనిపిస్తున్నాయి.’అయ్యప్పనుమ్ కోశియమ్’ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ అనే సంగ‌తి తెలిసిందే. పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటించారు. సంయుక్త మేనన్, నిత్యా మేనన్ హీరోయిన్లు. తమన్ సంగీతమందించారు. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు రాయగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఆ జుట్టునట్టా సవరించినాడో… సింగాలు జూలు విదిలించినట్టే…భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ లోడ్ అవుతోందని తెలియ‌జేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement