Monday, April 29, 2024

థియేటర్లలో భీమ్లా నాయక్ సందడి.. టాక్ ఎలా ఉందంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల హంగామా కనిపిస్తోంది. బెనిఫిట్ షో వాళ్లకోసం థియేటర్లకు అభిమానులు బారులుతీరారు. సినిమా తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. 

యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్స్ జరగ్గా, ఏపీ, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు వేశారు. ఇవి చూసిన ప్రేక్షకులు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. దాదాపు అందరూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు.  బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోశియమ్‌కు రీమేక్ భీమ్లా నాయక్ మూవీ తెరకెక్కింది. రానా దగ్గుబాటి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. దర్శకుడి టేకింగ్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమాకు ఊపు వస్తుందని, ఆ తర్వాతి నుంచి ప్రతి సన్నివేశం కళ్లు తిప్పుకోకుండా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా, పవన్ కల్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అంటున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement