Friday, May 3, 2024

Gold Rate: కొండెక్కిన బంగారం ధర.. తెలుగురాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి రేటు భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1370కి పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 51,550కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1250 పెరుగుదలతో రూ. 47,250కు చేరింది. ఇక, వెండి రేటు కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి ధర రూ.2,700 పెరుగుదలతో రూ. 72,700కు చేరింది.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడితో బంగారం భగభగమంటోంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేరుగా దేశీయ బులియన్ మార్కెట్‌పై పడింది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలతో పాటు బంగారం ధరలు పెరిగాయి. పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో బంగారం ధర ఏకండా 60 వేలకు  చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement