Sunday, May 5, 2024

కరోనాకు భీమయ్య ఆయుర్వేద మందు

నెలూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య నాటు మందుపై దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆనందయ్య మందుతో తాము కరోనా నుంచి కోలుకున్నామని ఇప్పటికే పలువురు బాధితులు చెప్పారు. అయితే, ఆనందయ్య మందుపై శాస్త్రీయత కోసం అధ్యయనం జరుగుతోంది. పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే మందు పంపిణీకి అనుమతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాజాగా తెలంగాణలోనూ అలాంటి ముందునే ఇస్తున్నారు ఓ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య అనే సింగరేణి మాజీ కార్మికులు ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారుచేశారు. ఆనందయ్యకు తీసిపోని విధంగా కరోనా వచ్చిన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి నయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మాస్క్‌ కూడా ధరించకుడా.. కరోనా రోగులను పక్కన కూర్చోబెట్టుకొని, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారని తెలిపారు.

కరోన భాదితులు వద్దకు వెళ్లిలంటే వైద్యులే పి.పి.కిట్స్ లేనిది వెళ్లడం లేదు. కానీ బచ్చలి భీమయ్యా ఎటువంటి మస్కు పెట్టుకోకుండానే కరోనా బాధితుల వద్దకు వెళ్తున్నాడు. ఎటువంటి భయం బెదురు లేకుండా వారిలో ధైర్యం నింపుతూ ట్రీట్మెంట్ అందిస్తున్నాడు. భీమయ్యా పసరు మందు తాగిన కరోన భాదితులు వైరస నుండి కొలుకున్నారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారే కాకుండా ఆక్సిజన్ లెవెల్ తగ్గి వెంటిలేటర్స్ పై ఉన్న వారు కూడా భీమయ్య మందుతో నయం చేశారు.

కరోనా వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు రూపాయలు వసూలు చేస్తున్నాయి. అయినా బాధితుడు బతుకుతారనే గ్యారెంటీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రజల దగ్గర లక్ష రూపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. కానీ బచ్చలి భీమయ్య మాత్రం డబ్బులు లేకుండానే ఆకు పసరుతో కరోనాను నయం చేస్తున్నాడని బాధితులు అంటున్నారు. ఆయన పూర్వీకులు ఆయుర్వేద మందులు తయారుచేసి స్థానికులు వైద్యం చేసేవారు. వారి నుంచి వైద్యం నేర్చుకున్న భీమయ్య.. ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారుచేశారు. ఆనందయ్యకు తీసిపోని విధంగా కరోనా వచ్చిన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు.

ఆనందయ్య లాగే బచ్చలి భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోజు రోజుకూ ఆయన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. మందును ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఐతే భీమయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కరోనా పేషెంట్లకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తానని భీమయ్య కూడా చెబుతున్నారు. తన మందుకు ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చి వైద్యానికి సహకరిస్తే కరొనా పేషెంట్లను ఇంకా చాలా మందిని నయం చేస్తానని భీమయ్యా అంటున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తానని చెబుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement