Friday, April 26, 2024

Covid Vaccine: కొవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గించిన భారత్ బయోటెక్

కరోనా టీకా కొవాగ్జిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. వ్యాక్సిన్లకు క్రమంగా డిమాండ్ తగ్గుతుండడం, టీకా సేకరణ సంస్థలకు ఒప్పందం మేరకు టీకాల సరఫరా పూర్తికావడంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కరోనా అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ టీకాను భారీగా ఉత్పత్తి చేసింది. అందుకోసం ఏడాది కాలంగా తమ ఉత్పత్తి కేంద్రాలన్నీ నిరంతరాయంగా పనిచేశాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పుడీ కేంద్రాలన్నింటినీ నవీకరించే ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే అంశంపై దృష్టిసారిస్తామని వివరించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement