Wednesday, May 8, 2024

Bharat Bandh: నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె.. ఆ సేవలపై తీవ్ర ప్రభావం

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు దిగాయి కార్మిక సంఘాలు. కార్మిక, కర్షకులు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జాయింట్‌ ఫోరం ఇంతకుముందే వెల్లడించింది. కార్మక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఈ సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని ఆల్​ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్​జీత్ కౌర్ తెలిపారు. గ్రామీణప్రాంతాల్లోనూ సమ్మె నిర్వహించనున్నారు. అయితే సమ్మె నేపథ్యంలో నిత్యావసర సేవలైన రవాణా, బ్యాంకింగ్​, రైల్వే, విద్యుత్తు సేవలపై ప్రభావం పడనుంది. కార్మికులు, ప్రజాసంఘాలు, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement