Saturday, May 21, 2022

ఆచార్య నుండి భ‌లే భ‌లే బంజారా ఫుల్ వీడియోసాంగ్

ఆచార్య చిత్రం నుండి భ‌లే భ‌లే బంజారా ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ వివ‌రాలు చూద్దాం. ఆచార్య ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషించారు. నిరంజన్ రెడ్డి – అన్వేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన కట్టిన బాణీలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజా ఈ సినిమా నుంచి ‘భలే భలే బంజారా’ పూర్తి పాటను రిలీజ్ చేశారు. నక్సలైట్లుగా ఉన్న ఆచార్య – సిద్ధ .. బృందంపై, రాత్రివేళలో గిరిజన గూడెంలో చిత్రీకరించిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, శంకర్ మహదేవన్ – రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement