Sunday, April 28, 2024

ఆక‌ట్టుకుంటోన్న భ‌ళాతంద‌నాన ట్రైల‌ర్

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌దైనశైలిలో దూసుకుపోతున్నాడు హీరో శ్రీవిష్ణు. కాగా ఆయ‌న న‌టించిన తాజా చిత్రం భళాతందనాన`. ఈ చిత్రంలో శ్రీవిష్ణుకి జోడీగా క్యాథ‌రిన్ థెరిస్సా హీరోయిన్ గా న‌టిస్తోంది.సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర‌ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేపుతోంది. ” శశి రేఖ అనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్.. ఎన్నో క్రైమ్ స్టోరీలను కవర్ చేస్తూ ఎప్పుడూ ప్రమాదమైన కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఆమెకు తోడుగా హీరో కనిపించారు. కానీ ఒక హవాలా కేసులో హీరోనే సస్పెక్ట్ గా చూపించారు. 2000 కోట్ల డబ్బు చుట్టూ హీరో పడుతున్నట్లు, మరోపక్క ఆ కేసును సాల్వ్ చేసే దిశగా హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు చూపించారు. ఇక చివర్లో ఆశ డబ్బు కంటే చాలాస్ట్రాంగ్ ఎమోషన్ అని శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్ తో కథమొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని చెప్పేశారు. ఇటీవలే ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ హీరోకి ్‌భళాతందనాన్‌ ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement