Monday, April 29, 2024

Bank holidays: వినియోగదారులకు అలర్ట్.. మార్చిలో బ్యాంకులకు సెలవులు ఇవే..

బ్యాంకు కస్టమర్ లకు ముఖ్య గమనిక. మార్చి నెలలో దేశంలో బ్యాంకులు దాదాపు సగం రోజులపాటు మూతపడనున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెలలో 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో మాత్రం బ్యాంకులకు 8 రోజులు సెలవులు రానున్నాయి. 

మహాశివరాత్రి, హోలీ వంటి ప్రధాన పండుగలతోపాటు రెండు, నాలుగో శనివారం, నాలుగు ఆదివారాలు బ్యాంకులు మూతపడనున్నాయి. నేడు మహా శివరాత్రి, 6న ఆదివారం, 12న రెండో శనివారం, 13న ఆదివారం, 18న శుక్రవారం హోలీ, 20న ఆదివారం, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 8 రోజులు మూతపడనున్నాయి. బ్యాంకులు మూతలో ఉన్నప్పటికీ ఏటీఎం కేంద్రాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement