Tuesday, May 7, 2024

తెలంగాణాలో వేవ్ తీసుకొస్తాం – అధికారంలోకి వ‌స్తాం – బండి సంజ‌య్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న అసెంబ్లి ఎన్నికల్లో అభ్యర్థులు ముఖ్యం కాదని పార్టీ గుర్తు కమలంపై ఎవరు నిల బడినా గెలిచేలా తెలంగాణలో ప్రత్యేక వేవ్‌ను తీసుకురాను న్న ట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. పైరవీలు చేస్తేనో లేదంటే ఆఫీసుల చుట్టూ, ముఖ్యనేతల చుట్టూ తిరి గితేనే బీజేపీలో టికెట్లు రావన్నారు. పనిచేయకుండా టికెట్లు ఆశిస్తూ నేతలు పోటీ పడితే ఒన గూరే ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కా రానికి ఆవిశ్రాంత కృషి చేసిన వారిని పార్టీనే గుర్తించి టిక్కెట్టు ఇచ్చి గుర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ”ఆంధ్రప్రభ”తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతుందన్నారు. అసెంబ్లి ఎన్నికల తోపాటు రాష్ట్ర ప్రజల మదిలో బీజేపీ మరింత బలంగా నాటుకు పోయేలా ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి, పార్టీ అగ్రనేత అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా తదితర ప్రము ఖులు తెలంగాణలో వరుసగా పర్యటిస్తారని చెప్పారు. నెలకోసారి ప్రధాని మోడీతోపాటు ఇత ర అగ్రనేతల పర్యటనలు ఉంటాయన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు కొనసా గిస్తు న్నారని, అదే మాదిరిగా తెలం గాణలోనూ ఆయన పర్యట నలు రాబోయే రోజుల్లో కొనసా గనున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో పంట నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్ట పోయినా ఇస్తానని హామీ ఇచ్చిన ఎకరాకు రూ.10 వేల సా యాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముందుగా మీరు ప్రకటించిన రూ.10 వేల పరిహారాన్ని చిత్తశుద్ధితో నష్టపోయిన ప్రతి రైతుకూ ఇచ్చి ఆ తర్వాత బీజేపీని విమర్శించాలని మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుతోపాటు ఇతర మంత్రులు, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు హితవు చెప్పా రు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకృతి విపత్తు సహా య నిధి(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నిధులనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీ ఆర్‌ఎఫ్‌ నిధుల కింద రైతులకు నష్టపరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement