Wednesday, May 1, 2024

‘ఆహా’ వేదిక‌పై బాల‌య్య డ్యాన్స్..ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..

నంద‌మూరి బాల‌కృష్ణ వ‌య‌సు 60దాటినా యూత్ కి పోటీగా రెచ్చిపోతున్నారు..వెండితెరే కాదు బుల్లితెర‌పై ఆయ‌న సంద‌డి చేస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ ఆహా వేదికగా..అన్‌‏స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ప‌లువురు ప్రముఖుల‌ని త‌న‌దైన స్టైల్‌లో ఇంట‌ర్వ్యూలు చేస్తూ.. పుల్ ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ కి మంచు ఫ్యామిలీ వ‌చ్చారు. రెండో ఎపిసోడ్‏లో గెస్టుగా న్యాచురల్ స్టార్ నాని రానున్నాడు. కాగా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ టాక్ షో వేదిక‌పై చిందులు వేసిన వీడియోని ఆహా విడుద‌ల‌చేసింది. అందులో హీరోయిన్ పూర్ణతో కలిసి బాలకృష్ణ ఫుల్ జోష్‏లో డ్యాన్స్ చేశారు. నందమూరి నాయక..పాటకు ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశాడు. బాల‌య్య ఎనర్జీకి ఆయ‌న ఫ్యాన్స్ తో పాటు అంద‌రూ ఫిదా అవుతున్నారు. నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది ఈ వీడియో.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement