Tuesday, May 7, 2024

బాలయ్య @ 107 మూవీ.. అప్ డేట్ ఎప్పుడంటే..

‘అఖండ’తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో బాలయ్య తన 107వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్ ను ఈనెల 5న ఉదయం 10 గంటలకు ఇవ్వనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది.

దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ.. బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించింది. ఫ్యామిలీ అడియన్స్ ను థియేటర్లకు రప్పించిన అఖంఢ విజయం సాధించింది. అఖండ సినిమా థియేటర్‌లో రిలీజైన మొదటి రోజు నుంచే వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్లింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకు ఎక్కింది. 145 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement