Monday, April 29, 2024

బిగ్ బాస్ లో బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ – కామెడీ షురూ

ఓటీటీలో ప్ర‌సారం అవుతోన్న బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ కొత్త కంటెస్టెంట్ గా రానున్నారు..
ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది బిగ్ బాస్. ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి హాస్యనటుడు మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యారు. బిందు మాధవి, అఖిల్, శివ ముగ్గురూ టాప్ 5 అంటూ బయటకొచ్చిన మహేష్ విట్టా తెలిపారు. ఇకపై బిగ్ బాస్ నాన్-స్టాప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పాన్ చేశారు. గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా బాబా భాస్కర్‌ మాస్టర్ ని కొత్త కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారికంగా ఓ వీడియోను కూడా రివీల్ చేశారు. కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బాబా భాస్కర్ మాస్టర్ ను మరోసారి బిగ్ బాస్ హౌజ్ లోకి, అందులోనూ సీక్రెట్ రూమ్ లోకి పంపారు. బాబా భాస్కర్ కు హోస్ట్ నాగార్జున స్వయంగా వెల్కమ్ చెప్పారు. నేను అనుకున్నంత స్ట్రెయిట్ గా ఏం లేరు… ముదురుగానే ఉన్నారు అంటూ వచ్చి రాగానే బాబాపై పంచ్ వేశారు నాగార్జున. ఈరోజు హౌజ్ మేట్స్ ను బాబా భాస్కర్ సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది.

https://www.youtube.com/watch?v=5X3fr47LJEQ&t=46s
Advertisement

తాజా వార్తలు

Advertisement