Saturday, May 4, 2024

Colombia: కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి.. 35 మందికి గాయాలు

పశ్చిమ కొలంబియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. 35 మంది గాయాలపాలైయ్యారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున సంభవించిన కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడి బండరాళ్లు, మట్టిలో ఇళ్లు కూరుకుపోయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా, కొలంబియాలో కొండచరియలు విరిగిపడటం సాధారణంగా మారింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉండేవారికి వర్షాకాలంలో ముప్పు ఎక్కువగా ఉంటోంది. 2019లో కౌకా ప్రావిన్సుల్లో కొండచరియలు విరిగిపడి 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement