Saturday, September 21, 2024

లక్ష్యఛేదనను తేలికగా తీసుకోవద్దు..

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ అలవోకగా విజయం సాధించింది. ఉత్తమ విషయం ఏమిటంటే ఎటువంటి భారీ షాట్‌లు తత్తరపాటు లేకుండా ప్రశాంతంగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. విజయలక్ష్యంకూడా సామాన్యంగానే ఉంది. అయితే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలోనూ చాలా జట్లు తడబాటుకు గురవుతున్నాయి. బలమైన టాప్‌ ఆర్డర్‌ ఉందని భావించి లక్ష్య ఛేదనను తేలికగా తీసుకుంటున్నాయి. అనూహ్యంగా టాప్ ఆర్డర్‌ కుప్ప కూలిపోతే లోయర్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగి ఆందోళన పెరుగుతుంది. ఒక సంవత్సరం క్రితమే భారత్‌ క్యాప్‌ను అందుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాడు దీపక్‌హుడాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మంచి పరిణామం. ఇద్దరూ చక్కని షాట్‌లు ఆడారు. ఎటువంటి రిస్క్‌లేకుండా పరుగులు రాబట్టారు. వెస్టిండీస్‌ జట్టు నిస్సందేహంగా వారి బ్యాటింగ్‌ తీరును విశ్లేషించుకోవాలి. జాసన్‌ హోల్డర్‌, ఫాబియన్‌ అలెన్‌ సమన్వయంతో మెరుగైన ప్రదర్శన చేశారు.

వీరి మాదిరిగానే విండీస్‌ టాపార్డర్‌ కూడా కృషి చేస్తే దీటైన స్కోరును నమోదు చేయవచ్చు. వాస్తవానికి సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణతోపాటు వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌ అద్భుతంగా రాణించారు. కీరన్‌ పొలార్డ్‌ను చాహల్‌, బ్రావోను సుందర్‌ మాయచేసి పెవిలియన్‌కు పంపడం ఆకట్టుకుంది. రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ చాలా ఆనందాన్నిచ్చింది. రోహిత్‌ వికెట్ల మధ్య పరుగెత్తడం చాలా సంతృప్తినిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం చేసిన తొడకండరాల గాయం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ పార్టనర్‌ వచ్చి ఎక్కువగా స్ట్రైక్‌ను స్కిప్పర్‌కు అందించాడు. బలమైన భారతజట్టు సిరీస్‌ను గెలుచుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కనిపించడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement