Monday, April 29, 2024

Breaking: తెలంగాణ భవన్​లో ఏర్పాట్లు పూర్తి.. కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న జనరల్​ బాడీ మీటింగ్​

తెలంగాణ భవన్​లో జరగబోయే టీఆర్​ఎస్​ (బీఆర్​ఎస్​) జనరల్​ బాడీ మీటింగ్​ కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ భేటీ కోసం టీఆర్​ఎస్​ఎల్పీ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఇవ్వాల జరగబోయే కీలక భేటీకి టీఆర్​ఎస్​ పార్టీ నుంచి 283 మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ గడ్డమీద నుంచి జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించడానికి సీఎం కేసీఆర్​ దసరా పండుగనాడు కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు.

ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఇక పంచాంగం, లెక్కలు వంటి వాటిని అంచనా వేసుకుని, వాటికి ప్రయారిటీ ఇచ్చే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనను ఇవ్వాల మధ్యాహ్నం 1.19 నిమిషాలకు నిర్ణయించారు. అయితే ఇది దివ్యమైన ముహూర్తం అని, ఇంత మంచి ముహూర్తాన ఏ పని ప్రారంభించిన అది విజయాన్ని సిద్ధిస్తుందని పండితులు కూడా చెబుతున్నారు.

ఇక.. దేశ రాజకీయాల్లో కేసీఆర్​కు తిరుగు ఉండదని, రాబోయే ఎన్నికల్లో విజయ పతాక ఎగరేయడం ఖాయం అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే పలు మతాల అధిపతులు కూడా సీఎం కేసీఆర్​కు సపోర్ట్​ ప్రకటించారు. అన్ని మతాల ప్రార్థనలు కూడా చేపట్టారు. ఇవ్వాల ఉదయం వరంగల్​లో భద్రకాళి అమ్మవారికి ఎమ్మెల్యే నన్నపనేని ప్రత్యేక పూజలు చేయించారు.

సీఎం కేసీఆర్​ దేశ రాజీయాల్లో రాణించి, కీలక నేతగా ఎదగాలని, మున్ముందు ప్రధాని కావాలని అమ్మవారిని కోరుకున్నారు. ఇట్లా యావత్​ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి సీఎం కేసీఆర్​ నాయకత్వం కోసం ప్రజలు, పలు పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను బతకనీయకుండా చేస్తున్నాయని, ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం బడా వ్యాపారులకు ఉపయోగపడేలా మాత్రమే ఉంటున్నాయని, చిరు వ్యాపారులు, పేదలు చితికిపోతున్నారన్న భావన అంతటా వినిపిస్తోంది.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్​ కూడా పలుమార్లు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. అటు రైతు చట్టాల విషయంలో కానీ, ఇటు ఉచిత విద్యుత్​ ఇవ్వకుండా కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్​ సంస్కరణల విషయంలో కానీ, ఇట్లా పలు అంశాలను కేసీఆర్​ వ్యతిరేకిస్తూ స్వరాన్ని పెంచారు. ప్రజల పక్షాన గొంతు వినిపిస్తూ.. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ పార్టీని ఇవ్వాల ప్రకటించి దసరా సంబురాల సాక్షిగా సక్సెస్​ సాధించాలని భావిస్తున్నారు. దీనికి యావత్​ దేశ మంతా కేసీఆర్​ నాయకత్వం కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం

Advertisement

తాజా వార్తలు

Advertisement