Thursday, May 9, 2024

వరవరరావు బెయిల్​ పిటిషన్​పై వాదనలు.. ఎన్​ఐఏ, జైళ్ల శాఖకు నోటీసులు జారీ

ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న విప్లవ కవి వరవరరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ బాంబే హైకోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), రాష్ట్ర జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఐఏకు నోటీసు జారీ అయినప్పుడు వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎస్‌బి శుక్రే, జిఎ సనప్‌లు విచారణ చేపట్టారు. ‘‘అతనో కవి.. అయితే అతనికి పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతనికి రాయడం కూడా ఇప్పుడు కష్టమే’’ అని వరవరరావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రస్తుతం వరవరరావు చేతితో రాయడం కూడా తగ్గిపోయిందని, అతనికి తీవ్రమైన తలనొప్పి ఉంది” అని న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదించారు. కోర్టులో సమర్పించిన వరవరరావు వైద్య నివేదికలో ఈ ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించారు.

ఫిబ్రవరి 2021లో తనకు హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర మెడికల్ బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ వరవరరావు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు విచారిస్తోంది. అంతకుముందు డివిజన్ బెంచ్ యొక్క ఫలితాలు తుది అంకానికి చేరాయని కోర్టు అభిప్రాయపడింది. అండర్ ట్రయల్‌ని కస్టడీలో ఉంచడం అతని ఆరోగ్య పరిస్థితికి విరుద్ధంగా ఉందని.. కోలుకోలేని స్థితికి అతని ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అతను (వరవరరావు) శాశ్వత బెయిల్ మంజూరు కోసం ఎందుకు పరిగణించకూడదు?” అని బెంచ్ ప్రశ్నించింది.

కొవిడ్ పరిస్థితిపై ఆధారపడిన ఫలితాలు ఉన్నాయని.. అందుకే కోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేయలేదని NIA న్యాయవాది సందేశ్ పాటిల్ వాదించారు. “తలోజా జైలులో ప్రాబ్లం అయితే.. అతన్ని వేరే జైలుకు తరలించండి” అని పాటిల్ సూచించారు.  ప్రబలంగా ఉన్న కొవిడ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని తాత్కాలిక బెయిల్ మంజూరు నిర్ణయాన్ని సవాలు చేయలేదన్నారు. కాగా వరవరరావుకు ఇప్పుడు 82 సంవత్సరాలు. జస్టిస్ శుక్రే వెంటనే పాటిల్‌ వాదనలను తిప్పికొట్టారు..  ఇప్పుడు వరవరరావు ఒక సంవత్సరం పెద్దవాడైనప్పుడు, అతన్ని తిరిగి జైలుకు పంపడానికి మంచి సమయం అని అన్నారు. “అతని వయస్సు మరింత పెరిగింది. తలోజాలో ఎలాంటి సౌకర్యాలు లేవు. అతని పరిస్థితి తలోజాలోని పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నట్లు కనుగొనబడింది”అని బెంచ్ పేర్కొంది.

హైదరాబాద్‌లోని తన నివాసానికి వరవరరావు మారాలనుకుంటున్నట్లు అతని తరపున వాదిస్తున్న న్యాయవాది ఆనంద్ గ్రోవర్​ చెప్పారు. ప్రస్తుతం కోర్టు విధించిన షరతుల కారణంగా వరవరరావు ముంబై పోలీసుల పరిధిలో ఉండాలి. బెయిల్ మంజూరు చేస్తే, అతను హైదరాబాద్‌లోనే ఉండాలనుకుంటున్నాడు. అతను పెన్షన్ పొందుతాడు.. తెలంగాణలో చాలా మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి. మహారాష్ట్రతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన వైద్య సదుపాయాలున్నాయి. అతని చికిత్స అంతా ఉచితంగా చేయవచ్చు. అతని భార్య ఇక్కడికి తరచూ రావడం ఖర్చుతో కూడుకున్న పని.. అతను హైదరాబాద్‌లో ఉంటే అతను తన జీవితంలోని ఈ తరుణంలో తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి మెరుగైన.. ఉచిత వైద్య సదుపాయాన్ని పొందవచ్చు” అని గ్రోవర్ వాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement