Saturday, May 18, 2024

Summer: కూలర్ కొంటున్నారా.. అయితే ఇట్లాంటి ఫీచర్​ ఉండేలా చూస్కోండి!

ఏప్రిల్​ మొదటి వారం నుంచే ఎండలు బాగా దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టెంపరేచర్లు దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్​ను మించి నమోదవుతున్నాయి. అయితే ఉదయం కాస్త పర్వాలేదు అనిపిస్తున్నా.. రాత్రివేళ మాత్రం ఉక్కపోతతో ఊపరి ఆడని పరిస్థితి తలెత్తుతోంది. మధ్యాహ్నం అయితే కాలు బయటపెట్టేందుకు జనాలు జంకుతున్నారు. అయినా, కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో జర్నీ చేయాల్సి వస్తోంది. ఇక ముందు ముందు ఎండల పరిస్థితి ఎట్లుంటదో తెలియడం లేదు. మరి ఎండలను దృష్టిలో పెట్టుకుని చాలామంది కూలర్లను కొనడానికి ప్లాన్​ చేస్తుంటారు. ఇట్లాంటి సమయంలో ఎలాంటి కూలర్​ కొనుగోలు చేయాలో ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం..

గాలిలోని వేడిని నీటి ఆవిరితో తగ్గించటమే ఎయిర్ కూలర్ల బేసిక్ సూత్రం.  దీన్నే ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. అయితే దీనివల్ల ఆ ఆవిరి అంతా ఇంట్లో ఉండే గాలిలో కలవటం వల్ల ఇంటి లోపల తేమ శాతం పెరిగిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువయితే మళ్లీ ఉక్కపోత మొదలవుతుంది.. ఇలా అవకూడదంటే ఎయిర్ కూలర్ వాడుతున్నప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉండకూడదు. ఇంట్లో తేమ పెరగకూడదు అంటే ఇంట్లోని గాలి బయటికి, బయటిగాలి ఇంట్లోకి వచ్చేలా వెంటిలేషన్ ఉండాలి.

ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న హైఎండ్ ఎయిర్ కూలర్లలో హ్యుమిడిటీ కంట్రోలింగ్ ఆప్షన్లు ఉంటున్నాయి. గాలిలోని తేమ శాతాన్ని తగ్గించేలా వాటిలో ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి కూలర్లు అయితే వెంటిలేషన్ లేకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయినా కూడా వెంటిలేషన్ ఉంటేనే ఉత్తమం. తేమకోసం కాకపోయినా స్వచ్ఛమైన గాలి ఉండటం అవసరం. ఇక ఆంధ్రప్రదేశ్​లోని కోస్టల్ ఏరియాల్లో అయితే హ్యుమిడిటీ కంట్రోల్ ఉన్న కూలర్ నే తీసుకోవాలి. లేదంటే ఎయిర్ కండిషనర్ తీసుకోవటం బెటర్‌‌, వాటివల్ల హ్యుమిడిటీ సమస్యలు ఉండవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement