Thursday, May 2, 2024

ఏపీలో 4.07 కోట్ల ఓటర్లు.. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.. ఈసీ లెక్క ఇదీ

ఆంధ్రప్రదేశ్ లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జనవరి 1, 2022 నాటికి ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,00,68,986 మంది ఉండగా..

2,05,97,544 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 4,62,880 ఎక్కువ. 4,071 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ, కృష్ణా జిల్లాలు అత్యధిక ఓటర్ల జాబితాలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 43,45,322 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 352 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

ఇక, ఏపీ ఓటర్లలో 7,033 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు… 67,935 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 65,678 మంది కాగా, మహిళలు 2,257 మంది ఉన్నారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 2,07,893గా ఉంది. వికలాంగుల నుండి 5,30,511 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా మొత్తం ఓటర్ల సంఖ్య చూస్తే.. శ్రీకాకుళం 2,29,58,56; విజయనగరం 1,90,20,77; విశాఖపట్నం3,71,94,38; తూర్పుగోదావరి 4,34,53,22; పశ్చిమగోదావరి 3,27,90,29; కృష్ణ 3,65,69,65; గుంటూరు 4,08,92,16; ప్రకాశం 2,68,05,56; నెల్లూరు 2,46,39,60; కడప 2,29,39,44; కర్నూలు 3,36,44,68. అనంతపురం 3,34,88,41, చిత్తూరు 3,29,66,07 మంది ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement