Tuesday, May 7, 2024

యాపిల్ ఐప్యాడ్ తో నిలిచిన ప్రాణాలు..ఏం జ‌రిగింది..

ఇప్ప‌టికే విమాన ప్ర‌మాదాలు చాలా జ‌రిగాయి..జ‌రుగుతూనే ఉన్నాయి. హ‌ఠాత్త్ గా విమానం సిగ్న‌ల్స్ తెగిపోతే ఎవ‌రికీ దిక్కుతోచ‌ని ప‌రిస్థితి. మ‌రి అటువంటి స‌మ‌యంలో సాయం అందించాల‌న్నా క‌ష్ట‌మే. అయితే యాపిల్ ఐప్యాడ్ పుణ్య‌మా అని తండ్రి కుమారై ప్రాణాలు నిలిచాయి. వివ‌రాల్లోకెళ్తే. పెన్సిల్వేనియాకు చెందిన తండ్రీకూతుళ్లు టూ సీటర్‌ ప్లేన్‌లో బయలుదేరారు. తండ్రి వయసు 58 ఏళ్లు కాగా కూతురు వయసు 13 ఏళ్లు. అయితే విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే రాడార్‌ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. విమానం కనిపించకుండా పోయింది. రాడార్‌ టీం యునైటెడ్‌ స్టే్ట్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ రెస్క్యూ కో-ఆర్డినేషన్‌కు సమాచారం అందించింది. వారు 30 మంది వలంటీర్లతో కలిసి విమానం చివరిసారి సిగ్నల్‌ చూపిన లొకేషన్‌కు వెళ్లారు. సుమారు 5 గంటల పాటు గాలించినా విమానం జాడను కనుక్కోలేకపోయారు.

ఆ తర్వాత పైలట్‌ భార్యను సంప్రదించిన రెస్క్యూ టీం అతని సెల్‌ఫోన్‌ నంబర్‌ను తీసుకుని దానిని పింగ్ చేశారు. అదే సమయంలో కుమార్తె వద్ద యాపిల్‌ ఐప్యాడ్‌ ఉందని తెలుసుకుని దానిని కూడా పింగ్‌ చేశారు. స్మార్ట్‌ఫోన్‌ లేదా స్మార్ట్‌ వాచ్‌, ఐప్యాడ్లలో ఉండే GPS టెక్నాలజీ సహకారంతో వాటిని పింగ్‌ చేసి దాని కచ్చితమైన లొకేషన్‌ను కనుగొనవచ్చు. యూఎస్‌ రెస్క్యూ టీం అదే పనిచేసింది. యాపిల్‌ ఐ ప్యాడ్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం సంఘటనా స్థలానికి వెళ్లిన రెస్క్యూ సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న తండ్రీ కూతుళ్లను గమనించారు. అదృష్టవశాత్తూ వారికి కొద్ది పాటి గాయాలు మాత్రమే తగిలాయి. దీంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement