Sunday, April 28, 2024

ఏ ఆసుపత్రిలో ఎన్ని ఖాళీ పడకలు?

ఏపీలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. దీంతో వైరస్ బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులకి బెడ్స్ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ డ్యాష్‌ బోర్డులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 185 ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులున్నాయి. వీటిల్లో మొత్తం 2,630 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా 1,684 ఖాళీగా ఉన్నాయి. 11,237 ఆక్సిజన్‌ పడకలకు 6,974 ఖాళీగా ఉన్నాయి. 5,889 సాధారణ పడకలకు 3,878 ఖాళీగా ఉన్నట్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు డ్యాష్‌ బోర్డు చూపించింది.

కాగా,  నిన్న 39,619 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా… ఏకంగా 9,716 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మూడు జిల్లాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనను పెంచుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 1,444 కేసులు, గుంటూరు జిల్లాలో 1,236 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,180 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 106 కేసులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,86,703కి చేరింది. మొత్తం 9,18,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 7,510కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయని నిన్నటి హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement