Thursday, March 28, 2024

శ్రీరామనవమిని మమ అనిపించిన ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు.అలాగే కృతిసనన్ సీతగా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అటు దర్శక నిర్మాతలు ఎక్కడా కూడా సినిమా పేరు ను కూడా ప్రస్తావించలేదు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ చెందారు. ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ కాకపోయినా ఏదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ అది జరగలేదు. దీంతో అభిమానులకు ఎదురుచూపులే మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement