Saturday, April 27, 2024

కరోనా విజృంభన.. వైద్య శాఖలో నియామకాలు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలు వేగవంతం చేయడానికి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుస్తోంది. కరోనా కట్టడికి చర్యలపై ప్రభుత్వం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 24 గంటలు గడవక ముందే గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలులోకి తెచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్( RTPCR) పరీక్షలు మరింత పెంచడానికి 113 టెక్నికల్ సిబ్బంది నియామకానికి మంత్రి ఆళ్ల నాని ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న విఆర్డీఎల్( VRDL) కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాష్ట్రంలో ఉన్న విఆర్డీఎల్ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు రిపోర్ట్ అతి తక్కువ సమయంలో రావడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 6 నెలలు పాటు కాంట్రాక్టు బేస్ లో కొత్తగా సిబ్బంది నియామిస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ పరీక్షలు మరింత పెంచడానికి అదనపు సిబ్బంది నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. గత ఏడాది మార్చిలో వచ్చిన మొదటి విడత కోవిడ్ లో 92మందిని నియమించామని చెప్పారు. మూడు దశల్లో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు 533 మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసినట్లు వివరించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో 110 మందిని తక్షణమే టెక్నికల్ మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి విఆర్డీఎల్ కేంద్రంలో కరోనా పరీక్షలు చేయడానికి ఒక రిచర్సి  సైoటిస్థు, రిచర్చి అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సభార్డినేట్ పోస్ట్లు భర్తీ చేస్తున్నామన్నారు. 6 నెలలు పాటు కొత్తగా నియమిస్తున్న సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రత్యేకంగా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రతి రోజు 40వేలకు పైబడి చేస్తున్నామని తెలిపారు. కొత్తగా సిబ్బంది నియామకం వల్ల RTPCR పరీక్షలు రోజుకి 60 వేలకు పైబడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 ట్రూనాట్ పరీక్షలు గతంలో రోజుకి 10 వేలు పరీక్షలు చేసాం అని తెలిపారు. ట్రూనాట్ పరీక్షలు కూడ మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షలు కూడ నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీ, విజయనగరం మహారాజ మెడికల్ కాలేజీల్లో కూడ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement