Sunday, April 28, 2024

అన్నా, డబులింజన్​ పాలన గిట్లనే ఉంటదా?.. కుప్పకూలిన ఎక్స్​ప్రెస్​ వే, బీజేపీ అవినీతికి సాక్ష్యం ఇదే!!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రతి మూలను విశాలమైన, ఆధునిక రహదారి -ఎక్స్ ప్రెస్ వేతో అనుసంధానించే పని వేగంగా జరుగుతోంది. ఇది రక్షణ కారిడార్​గా ఉంటుంది.  పూర్వాంచల్ కు ఎక్స్ ప్రెస్ వే లేదా బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, గోరఖ్ పూర్ లింక్ వే లేదా గంగా ఎక్స్ ప్రెస్ వే.. ఇవన్నీ ఈ దశాబ్దంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని కొత్త తీరాలకు తీసుకువెళతాయి. ఈ మార్గాల్లో రైళ్లను నడపడమే కాకుండా స్వీయ -ఆధారిత భారతదేశాన్ని బలోపేతం చేసే కొత్త పారిశ్రామిక క్లస్టర్లను కూడా సృష్టిస్తాయి.

– బుందేల్​ఖండ్​ ఎక్స్​ప్రేస్​ వే ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ..

అత్యాధునిక టెక్నాలజీతో, సౌకర్యవంతంగా నిర్మించిన ఎక్స్ ప్రెస్‌వే ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రారంభించిన అయిదు రోజులకే బ్రిడ్జి కూలిపోయింది. అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఇటు యూపీలోని యోగీ సర్కారు చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇట్లా దెబ్బతినడంతో బీజేపీ వర్గాలకు నోటిమాట రావడం లేదు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక బ్రిడ్జి ఇట్లా కూలిపోవడంపై అధికారక వర్గాలు, బీజేపీ లీడర్లు అంతర్మథనంలో పడ్డారు. దీనిపై విపక్షాల నుంచి, సోషల్​ మీడియాలోనూ విపరీతమైన కామెంట్స్​, మీమ్స్​ వస్తున్నాయి. అందులో మెయిన్​గా చెప్పుకోవాల్సింది ఎంటంటే.. ప్రధాని మోదీ నిత్యం పలికే వచనాలతో దీన్ని రూపొందించారు.

‘‘మిత్రో ఇదే మా అభివృద్ది”అంటూ ప్రధాని ఫొటోతో పాటు.. కుప్పకూలిన బ్రిడ్జి భాగాన్ని కనిపించేలా మీమ్​ తయారు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఎలా తాండవిస్తుందో చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని ఆ మీమ్​లో రాసుకొచ్చారు. ఇక.. డబుల్​ ఇంజిన్​సర్కారు చేసిన ఈ సిగ్గుమాలిన పని అంటూ చాలామంది ట్రోల్స్​ చేస్తున్నారు.

ఇక.. జులై 16న ప్రధాని మోదీ ప్రారంభించగా.. జులై 22న బ్రిడ్జి కుప్పకూలడంపై బీజేపీ లీడర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్షాలతోపాటు సోషల్​ మీడియాలో ఎదురయ్యే ప్రశ్నలను ఎట్లా తట్టుకోవాలే అనే ఆలోచనలలో పడ్డట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement