Monday, December 11, 2023

Big Breaking: సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ.. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీకుమార్

సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసిబి డీజీగా ఉన్న అంజనీకుమార్ ను తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా నియమించారు. హోమ్ సెక్రటరీగా పనిచేస్తున్న రవి గుప్తాను ఏసీబీ డీజీగా, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గా పనిచేస్తున్న జితేందర్ ను హోం సెక్రటరీగా, రాచకొండ కమిషనర్ గా పనిచేస్తున్న మహేష్ భగవత్ ను సిఐడి అడిషనల్ డీజీగా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ లో పనిచేస్తున్న దేవేంద్ర సింగ్ చౌహాన్ ను రాచకొండ సిపి గా, పి అండ్ ఎల్ అడిషనల్ డీజీగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ జైన్ ను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement