Wednesday, May 15, 2024

బిల్లులు చెల్లించేందుకు నిధులు లేవని చెప్పడం సరికాదు: హైకోర్టు

ఏపీ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు పనులకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు నిధులు లేవని చెప్పడంపై మండిపడింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే మూడు రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించింది.హైకోర్టు ముందు హాజరు కావాలని ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదంటూ చిత్తూరు, తూ.గో జిల్లాకు చెందిన యర్రంరెడ్డి, ఆర్.శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిధులు లేక బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు సీరియస్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement