Sunday, April 28, 2024

యాంక‌ర్ సుమ – కుమారుడిని చూశారా -షాకిస్తోన్న‌ ఫొటోస్

ప్రస్తుతం స్టార్ యాంక‌ర్ ఎవ‌రంటే సుమ పేరే చెబుతారు అంతా. కాగా బుల్లితెర‌పైనే కాదు..వెండితెర‌పై మెర‌వ‌నుంది సుమ‌. జ‌య‌మ్మ పంచాయితీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా తనయుడి కోసం ఏకంగా ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు సుమ. ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్‌ చేశారు. గతేడాది ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా రోషన్‌ లుక్‌ షాకిస్తుంది. భారీ పర్సనాలిటీతో కనిపిస్తున్నారు. రోషన్‌ పుట్టిన రోజు సందర్భంగా,మదర్‌, యాంకర్‌సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోషన్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది. కుమారుడు రోషన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, పంచుకున్న ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే నిర్మల కాన్వెంట్‌ చిత్రం సమయంలో చిన్నగా ఉన్న రోషన్‌ ఇప్పుడు ఒకేసారి గుర్తుపట్టేనంతగా మారిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అప్పుడే ఇంత పెద్దోడైపోయాడా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు సుమ అక్కలా, రోషన్‌ తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు చేయడం విశేషం. రోషన్‌ కటౌట్‌ మాత్రం ప్రభాస్‌ మాదిరిగా భారీగా ఉండటం మరో విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement