Friday, April 26, 2024

అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ మూవీ రివ్యూ

రేటింగ్: 2.75/5

సినిమా థియేటర్లు క్లోజ్ చేయడంలో పలు మీడియం రేంజ్, చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. సెకండ్ వేవ్‌లో థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈరోజు ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

అభి (విరాజ్ అశ్విన్) స్నేహితులు, అమ్మాయిలతో జులాయిగా తిరుగుతూ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు. తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడిలోని కోపం, లెక్కలేని తనం కారణంగా ఇంటి నుండి బయటకు వచ్చి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు ప్రియ (అనసూయ) తన భర్తను ఓ ప్రమాదంలో పోగొట్టుకుంటుంది. పైగా ఆమె నిండు గర్భిణీ. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రియ ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అయితే ఓ రోజు అనుకోకుండా అభి, ప్రియ ఒకే లిఫ్టులో ఇరుక్కుంటారు. ఆ టైంలో ప్రియకు నొప్పులు ప్రారంభం అవుతాయి. అప్పుడు అభి ఏం చేశాడన్నదే సినిమా కథ.

ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ గతంలో మూడు, నాలుగు చిన్న సినిమాల్లో నటించినా ఈ మూవీలో మాత్రం గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు. ఇక ప్రియ పాత్రలో నటించిన అనసూయ అద్భుతంగా నటించింది. సెకండాఫ్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సన్నివేశాల్లో ఆమె చాలా సహజంగా నటించింది. విరామానికి ముందు వచ్చే సన్నివేశంలో, డెలివరీ అయ్యే సీన్‌లో ఆమె నటన బాగుంది. ఇక అభి తల్లి పాత్రలో నటించిన ‘కార్తీక దీపం’ ఫేం అర్చన, మారుతండ్రి పాత్రలో నటించిన అనిల్ కురువిల్లా, ప్రియ అత్త పాత్రలో అన్నపూర్ణ, అభి స్నేహితుడిగా వైవా హర్ష వాళ్ల పాత్ర పరిధుల మేరకు నటించారు. ప్రియ భర్త పాత్రలో నటించిన ఆదర్శ్‌ది అతిథి పాత్ర మాత్రమే.

ఎమోషనల్‌గా మంచి కంటెంట్ తీసుకున్న దర్శకుడు రమేష్.. ఈ మూవీలో కీలక సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం మాత్రం ఆకట్టుకోదు. అయితే ఈ చిత్రానికి ప్రధాన బలం సెకండ్ హాఫ్, మొదటి సగం సోసో గానే నడుస్తోంది. పైగా కీలక సన్నివేశాలు సాగదీసినట్లు స్లోగా సాగుతాయి. సినిమాలో విరాజ్ అశ్విన్, అనసూయల నటనతో పాటు కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని ఒకసారి చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement