Sunday, June 20, 2021

దేశంలో మరోసారి రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు….24 గంటల్లో 4 లక్షల కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,14,188 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరోవైపు 3,915 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,14,91,598 చేరింది. అలాగే 36,45,164 మందికి చికిత్స పొందుతున్నారు.ఇక కరోన నుండి ఇప్పటి వరకు 1,76,12,351 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ సోకి 2,34,083 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 3,31,507 మంది బాధితులు కొలుకున్నారు. అంతే కాదు దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.95%, మరణాల రేటు 1.09%. గా నమోదు అయింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 16,49,73,058 మందికి కరోనా టీకాలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News