Thursday, May 2, 2024

సుమ‌తిగా రంగ‌మ్మ‌త్త‌…

సుమతి అనే ఓ పాత్రలో అనసూయ భరద్వాజ్‌ పోషి స్తోంది. ప్రతీ కథలోనూ హృద యాలను కదిలించే భావోద్వేగం ఉంటు-ంది. అలాంటి సుమతి అనే ఓ ఎమోషనల్‌ అండ్‌ బోల్డ్‌ క్యారెక్ట ర్‌లో అనసూయ నటించడం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం పేరు ‘విమా నం’. జూన్‌ 9న ఈ చిత్రం తెలుగు, తమిళ విడుదల కానుంది. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిరణ్‌ కొర్రపాటి విమానం చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. విమానం మూవీ మేకర్స్‌ సుమతి పాత్రకు సంబంధించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. అసలు ఆమె అలా రెడీ కావటానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటు-న్నారు మేకర్స్‌.’విమానం’ చిత్రంలో వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్‌ ధ్రువన్‌ నటిస్తుండగా రాజేంద్రన్‌ పాత్రలో రాజేంద్రన్‌, డేనియల్‌ పాత్రలో ధన్‌ రాజ్‌, కోటి పాత్రలో రాహుల్‌ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement