Monday, April 29, 2024

ముగ్గురు హీరోయిన్ల‌తో అమ్మ‌దొంగా?.. ఒకే హీరోయిన్‌తో 18 సినిమాలు కృష్ణ స్సెషాలిటీ!

సూప‌ర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీశ్రీ (2016)చిత్రంలో టైటిల్‌ రోల్‌లో నటించారు. ఈ చిత్రంలో విజయ నిర్మల, నరేశ్‌, సాయికుమార్‌, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు. అంతకుముందు 2013లో ఆదిసాయికుమార్‌ హీరోగా నటించిన సుకుమారుడు సినిమాలోనూ కీలక పాత్రలో నటించారు. ఇదే సంవత్సరంలో శ్రీకాంత్, చార్మి కాంబోలో వచ్చిన సేవకుడు మూవీలోనూ కృష్ణ‌ అతిథి పాత్రలో కనిపించారు.

ఇక‌.. ఒకే హీరోయిన్‌తో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా అరుదైన రికార్డు కూడా సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న ఖాతాలో వేసుకున్నారు. కృష్ణ తన సతీమణి, నిర్మాత, నటి విజయ నిర్మలతో 48 సినిమాలు (సుమారు) చేశారు, ఆ త‌ర్వాత మరో నటి జయప్రదతో 43 సినిమాల్లో నటించారు. కృష్ణ, శ్రీదేవి కాంబినేషనల్‌లో 31సినిమాలు వచ్చాయి. అలాగే సూపర్‌ స్టార్‌ కృష్ణతో 80 మంది హీరోయిన్లు నటించారు. ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్ల‌తో (అమ్మ దొంగా) న‌టించిన అరుదైన ఘ‌న‌త కూడా సూప‌ర్ కృష్ణ‌కే ఉంది. ఆ సినిమాలోని ‘‘నీతో సాయంత్రం ఎంతో సంతోషం”అనే పాట అయితే ఇప్పటికీ కుర్రకారుని ఊహాలోకంలోకి తీసుకెళ్లేలా ఉంటుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement