Monday, April 29, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 29

జరామరణమోక్షాయ
మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదు: కృత్స్నమ్‌
అధ్యాత్మం కర్మ చాఖిలమ్‌ ||

తాత్పర్యము : ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్య కర్మలను గూర్చి సమగ్రముగా నెరిగియుండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై యున్నారు.

భాష్యము : జన్మ మృత్యు జరా వ్యాధులు ఈ శరీరానికే గాని ఆత్మకు ఉండవు. కాబట్టి ఎవరైతే భగవంతుణ్ణి పూజించి, భగవద్దామానికి చేరుకుందురో వారు ముక్తులైనట్లు. ‘అహం బ్రహ్మాస్మి’ ‘నేను బ్రహ్మము’ ‘నేను ఆత్మను’ అని అర్థము చేసుకొనవలెను. శుద్ధ భక్తులు ముక్త స్థితిలో ఉందురు కనుక
బ్రహ్మస్థరములో ఉండి, దివ్యమైన లీలలను అర్థము చేసుకోగలుగుతారు. నాలుగు రకాల వారు, వేరు వేరు అవసరాల కోసము భగవంతుణ్ణి ఆశ్రయించినా, చివరకు పరిశుద్ధులై భగవద్దామానికి చేరుకొందురు. అయితే దేవతలను పూజించేవారు, నిరాకారవాదులు భగవంతుని పట్ల అపోహలు కలిగి ఉందురు కాబట్టి సర్వోన్నతలోకమైన కృష్ణలోకానికి చేరలేరు. ఇలా కేవలము భగవంతుణ్ణి ఆశ్రయించిన వారే నిజానికి ‘బ్రహ్మము’ కాగలదు. మోక్షమును కోరుచూ కొందరు అర్చ విధానము ద్వారానో, ధ్యానము ద్వారానో భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటే భగవంతుడు వారికి కూడా కృపను చూపి ‘బ్రహ్మము’ ను గురించి
అవగాహనను ప్రసాదించును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement