Saturday, April 27, 2024

మానవత్వం మంటగలిసింది.. మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలివెళ్లిన అంబులెన్స్ డ్రైవర్

కృష్ణాజిల్లా తిరువూరులో మానవత్వం మంట గలిసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలి వేసి వెళ్లిపోయారు 108 అంబులెన్సు సిబ్బంది. తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామానికి షేక్ సుభాని(40) గత రెండు రోజుల నుండి జ్వరంతో భాదపడుతున్నాడు. తన భార్య సహాయంతో తిరువూరులోని కోవిడ్ హాస్పిటల్ కు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కి తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రి వద్ద సుభానిని పరిశీలించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. తిరిగి 108లో ఇంటికి వెళ్తుండగా అంబులెన్సు సిబ్బంది ఏ మాత్రం మానవత్వం చూపకుండా కరోనాతో చనిపోయాడంటూ మృతదేహాన్ని పట్టణ శివారులో రోడ్డుపక్కగా వదిలి వెళ్లిపోయారు. మృతదేహం అలా రెండు గంటలుగా రోడ్డు పైనే అనాథలా పడిఉంది. భర్త మృతదేహం పక్కనే భార్య రోదిస్తూ ఉండడాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అనంతరం దగ్గర ఉండి దహానసంస్కారాలకు కావలసిన ఏర్పాటు చేశారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. వైసీపీ పట్టణ మైనారిటీ నాయకుడు షేక్‌ జాకీర్‌ దగ్గరుండి ఖననం చేయించారు. అంబులెన్సు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.

 ఈ ఘటన చూసిన పలువురు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. డ్రైవర్ పై చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మానవత్వం లేకుండా మృతదేహాన్ని రోడ్డు మీదనే వదిలివేయడం దారుణమని ఘటనకు కారణమైన డ్రైవర్ ను సస్పెండ్ చేస్తున్నామని తెలిపింది.

ఇదీ చదవండి: ఆస్ట్రాజెనెకా టీకా ఒక్క డోసుతోనే 80 శాతం ముప్పు తప్పినట్లేనటా..

Advertisement

తాజా వార్తలు

Advertisement