Friday, April 26, 2024

పాతబస్తీ నుంచి కరోనా పరార్..!

కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడిపోతున్న వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీలో వైరస్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉండడం వైద్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. పాతబస్తీ పీహెచ్‌సీలలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కొవిడ్ పరీక్షలు చేస్తున్నప్పటికి…వారిలో 5 శాతం మంది కూడా పాజిటివ్‌గా తేలడం లేదు. ముఖ్యంగా దారుల్‌షిపా ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 10న 50 మందికి పరీక్షలు చేస్తే వారిలో ఒక్కరు మాత్రమే పాజిటివ్‌గా తేలారు. వైరస్‌ను కచ్చితంగా పట్టుకోగలిగే ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్ రేటు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దారుల్‌షిఫా, అజాంపుర, యాకుత్‌పుర ఆరోగ్య కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల్లో 99 శాతం మంది నెగటివ్‌గానే బయటపడుతున్నారు. మరీ ముఖ్యంగా యాకుత్‌పుర-2 పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్ రేటు సున్నాగా ఉండడం గమనార్హం. ఈ పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు 471 మందికి పరీక్షలు చేస్తే ఒక్కరు కూడా కొవిడ్ బారినపడినట్టు నిర్దారణ కాలేదు. అదే సమయంలో హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ఈ రేటు 40 నుంచి 50 శాతంగా ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement