Friday, April 26, 2024

విజృంభిస్తోన్న క‌రోనా..యూర‌ప్ లో లాక్ డౌన్..!

ప్ర‌పంచ‌దేశాల‌న్నీ క‌రోనా ధాటికి అత‌లాకుత‌ల‌మ‌య్యాయి..ఇప్ప‌డిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతోంద‌నుకుంటోన్న నేప‌థ్యంలో మ‌ళ్ళీ క‌రోనా విజృంభిస్తోంది. ప‌లు దేశాల్లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. బ్రిట‌న్,జ‌ర్మ‌నీ,ఆస్ట్రియా,ర‌ష్యాలాంటి దేశాల్లో క‌రోనా బారిన ప‌టి ప‌లువురు మ‌ర‌ణిస్తున్నారు. ఆయా దేశాల్లో రోజుకు సగటు 30 వేల కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటున్నాయి. ఇండియాలో థ‌ర్డ్ వేవ్ రానుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు వైద్యనిపుణులు. కాగా యూరప్ లో నాలుగో వేవ్ ప్రారంభమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా తీవ్రత కారణంగా పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ ఆలోచనల్లోకి వెళుతున్నాయి. తాజాగా ఆస్ట్రియా దేశంలో కరోనా తీవ్రత కారణంగా లాక్ డౌన్ విధించింది. నేటి నుంచి ప‌ది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. వైరస్​ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో ప‌ది రోజులు లాక్​డౌన్​ పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా పౌరులు ఎవ‌రూ బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలను విధిస్తామని ప్రభుత్వం హెచ్చ‌రించింది.

లాక్ డౌన్ విషయంలో ఆస్ట్రియా ఛాన్సలర్​ అలెగ్జాండర్ షాలెన్​బర్గ్ క్షమాపణలు చెప్పారు. టీకాలు తీసుకున్నవారు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతుండటంతో క్షమాపణలు చెప్పారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్ డౌన్ విధించినట్లు షాలెన్ బర్గ్ తెలిపారు.ఇప్పుడు యూర‌ప్ లో కూడా క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డ కూడా లాక్ డౌన్ ని విధించే దిశ‌గా యోచిస్తోంది ప్ర‌భుత్వం. ఇటువంటి క్లిష్ట‌స‌మ‌యంలో లాక్ డౌన్ ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌ని తేల్చి చెబుతున్నాయి ప్ర‌భుత్వాలు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement