Saturday, November 27, 2021

‘ఈ-బైక్’ విశేషాలు తెలుసా..

ప్ర‌భ‌న్యూస్ : కర్నాటకలోని ఎన్‌ఐటీ విద్యార్థులు అటవీ శాఖ కోసం ఈ-బైక్‌ను రూపొందించారు. ఎంతటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా ఈ బైక్‌పై సులువుగా వెళ్లగల్గడమే ఈ-బైక్‌ ప్రత్యేకత. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్నాటక (ఎన్‌ఐటీకే) రూపొందించి ఈ బైక్‌ ఎంతో శక్తివంతంగానూ ఉంది. అడవులను రక్షించేందుకు దట్టమైన చెట్లు ఉండే ప్రాంతాని వెళ్లే అటవీ శాఖ అధికారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (వాటర్‌ రీసోర్స్‌ అండ్‌ ఓసియన్‌ ఇంజినీరింగ్‌, ఎన్‌ఐటీకే, సూరత్‌కల్‌) డాక్టర్‌ పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. సోలార్‌ పవర్‌తో ఇది నడుస్తుందని, వాకీ టాకీని చార్జింగ్‌ పెట్టే సదుపాయం కూడా ఉన్నట్టు వివరించారు. మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీకి కూడా కనెక్ట్‌ చేయవచ్చన్నారు.

ఈ-బైక్‌కు జీపీఎస్‌ సిస్టం సదుపాయం కూడా కల్పించారు. హెడ్‌ లైట్‌ను డిస్‌మెటల్‌ చేసి.. టార్చ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో బ్యాటరీలు ఉంటా యి. ఎన్‌ఐటీ విద్యార్థి రక్షిత్‌ మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారుల కోసం కొత్తగా ఓ బైక్‌ను తయారు చేయాలనే ఆలోచన తమ ప్రొఫెసర్‌కు వచ్చిందన్నారు. ఆయన తన ఐడియాను తమతో షేర్‌ చేశారని, దీంతో అందరూ కూర్చొని దీనిపై చర్చించామన్నారు. డిజైన్‌కు సంబంధించిన అంశం ఎంతో కీలకమని తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి.. ముందుకెళ్లినట్టు వివరించారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News