Friday, April 26, 2024

‘యూఎస్’ లో మిలియ‌న్ మార్క్ ని ట‌చ్ చేసిన అఖండ

అఖండ రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టిస్తూనే ఉంది. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యాజైశ్వాల్ జంట‌గా న‌టించారు. ఇప్ప‌టికే వంద కోట్ల రూపాయ‌ల‌కు పైగా రాబ‌ట్టిందీ చిత్రం. కాగా రీసెంట్ గా అఖండ యూఎస్ లో మిలియ‌న్ మార్క్ ని ట‌చ్ చేయ‌డం విశేషం. ఈ ఏడాది అక్కడ మిలియన్ డాలర్లను దక్కించుకున్న అతి తక్కువ సినిమాల జాబితాలో ‘అఖండ’ చేరిపోయింది. బాలకృష్ణ – బోయపాటిలకు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం .. 100 కోట్ల క్లబ్ లో చేరడం .. యూఎస్ లో మిలియన్ డాలర్లను రాబట్టడం ‘అఖండ’ ఖాతాలో కనిపిస్తున్న అరుదైన విషయాలు అనే చెప్పాలి. మ‌రి ఈ చిత్రం ఇంకెన్ని రికార్డ్స్ ని తిర‌గ‌రాయ‌నుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement