Friday, May 17, 2024

ఆహాలో దొంగాట – మే6న స్ట్రీమింగ్

ఈ మ‌ధ్య ప‌ర‌భాషలో హిట్ట‌యిన సినిమాల‌ను నేరుగా తెలుగులో డ‌బ్బింగ్ చేసి ఓటీటీల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మ‌రో మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సినిమాను తెలుగులో డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ ఫాహాద్ ఫాజిల్ ప్రాధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘తొందిముత‌లం ద్రిక్షక్షియ‌మ్‌’. 2017లో విడుద‌లైన ఈ సినిమా మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఉత్త‌మ మ‌ల‌యాళ చిత్రంగా నేష‌న‌ల్ అవార్డును కూడా ఈ చిత్రం గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘దొంగాట’ పేరుతో మే 6న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది విడుద‌లైన పుష్ప సినిమాతో ఫాహ‌ద్‌కు తెలుగులో మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో మెప్పించాడు. సినిమాలో ఉంది కొద్ది సేపే అయినా ఈయ‌న పాత్ర ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఫాహాద్ ‘పుష్ప పార్ట్-2’ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement