Saturday, May 4, 2024

ఏజెంట్ లో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ ‘మ‌మ్ముట్టి’

హీరో అఖిల్ తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు మ‌ల‌యాళ స్టార్ న‌టుడు మ‌మ్ముట్టి. గతంలో మమ్ముట్టి ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అఖిల్ చిత్రానికి మమ్ముట్టి ఒకే చెప్పడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘క్రమశిక్షణ .. అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో నటించారు.’ అంటూ ట్విట్టర్ లో తెలిపారు. మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ మూవీకి స్పై థ్రిల్లర్ కథను వక్కంతం వంశీ రాశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ .. సురేందర్ 2 బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి కథానాయికగా నటిస్తోంది. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement