Saturday, December 7, 2024

కేటీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తిన ఆదిత్య థాకరే

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ను శివ‌సేన ఎమ్మెల్యే ఆదిత్య థాక‌రే ప్రశంసలతో ముంచెత్తారు. ఈరోజు హైద‌రాబాద్‌లోని టీహ‌బ్‌ను ఆదిత్య థారకే సంద‌ర్శించారు. అక్క‌డ మంత్రి కేటీఆర్ తో ఆయ‌న చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో త‌న ట్విట్ట‌ర్‌లో ఆదిత్య థాక‌రే స్పందిస్తూ.. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన ప్ర‌తిసారి అద్భుతంగా, ఎంక‌రేజింగ్ ఫీల‌వుతాన‌ని అన్నారు. సుస్థిర‌త‌, ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, సాంకేతిక‌త లాంటి అంశాల‌పై ఇద్ద‌రం చ‌ర్చించుకున్నామ‌ని, భార‌త దేశ ప్ర‌గ‌తిలో ఆ అంశాలు కీల‌క‌మైనవ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించుకున్న‌ట్లు ఆదిత్య థాక‌రే తెలిపారు. టీహ‌బ్ లో జ‌రిగిన వ‌ర్క్ గురించి ఆదిత్య థాక‌రే స్ట‌న్ అయ్యారు. టీహ‌బ్ మ‌హాద్భుతంగా ఉందని ప్రశంసించారు. స్టార్ట్ అప్‌లు, ఆవిష్క‌ర్త‌లు, ఆలోచ‌నాప‌రుల‌కు టీహ‌బ్ మంచి ఊతం ఇస్తున్న‌ట్లు థారకే పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement