Thursday, May 2, 2024

నాలాంటి వాళ్ల అవసరం ఉండదు: మంత్రి కేటీఆర్ పై నటుడు సోనుసూద్ ప్రశంసలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ ప్రశంసలు కురింపించారు. కేటీఆర్‌ లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్‌-19 వారియర్స్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. వాళ్లకు సహాయ పడడమే ఇక తన ముందున్న సవాల్‌ అని చెప్పారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందన్నారు.

ఇది కూడా చదవండి: అందుకే సోనూసూద్ పై ఐటీ దాడులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement