Tuesday, May 14, 2024

ఫ్యాక్ట్ చెక్: నేను బతికే ఉన్నా- నటుడు చంద్రమోహన్

సినీ నటుడు చంద్రమోహన్ ఆరోగ్యం బాగోలేదని, ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రమోహన్ స్పందించారు. తన ఆరగ్యోంపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన కోరారు. తాను చనిపోయారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. తన ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారమవుతోందని చంద్రమోహన్ చెప్పారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. అందరి అభిమానాలే తనకు శ్రీరామ రక్ష అని అన్నారు. తాను బతికే ఉన్నట్లు స్వయంగా నటుడు చంద్రమోహన్ ఓ వీడియోనూ మీడియాకు విడుదల చేశారు.

కాగా, తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటుల్లో ఒకరిగా చంద్రమోహన్ పేరుగాంచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సమయంలో యువకుడిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఆయన… హీరోగా ఎన్నో విజయాలను అందుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన సినీ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. చంద్రమోహన్ దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించి అందరినీ అలరించారు. క్యారెక్టర్ నటుడిగా కూడా ఎన్నో పాత్రలు పోషించారు. ఈ మధ్యనే చంద్రమోహన్ తన పుట్టినరోజును కూడా జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement