Monday, April 29, 2024

సంపాదనలో రూట్ తర్వాతే కోహ్లీ

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ కెప్టెన్‌లలో అత్యధిక ఆదాయం పొందుతున్న జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ కన్నా రూట్‌ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. భారత క్రికెట్‌ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి బీసీసీఐ అతనికి గ్రేడ్‌ ఏ+ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. కోహ్లీకి వార్షిక వేతనంగా రూ.7కోట్లను బీసీసీఐ చెల్లిస్తుంది.

మరోవైపు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ ఏడాదికి రూ.7.22 కోట్లను ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు నుంచి తీసుకుంటున్నాడు. విరాట్‌ కోహ్లీ కంటే ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా ఎక్కువ మొత్తాన్ని అందుకుంటుండటం విశేషం. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లీ రూ.17 కోట్లను వేతనంగా పొందుతున్నాడు.

కెప్టెన్‌ల వార్షిక వేతనాలు:
✪ జోరూట్ (ఇంగ్లండ్): రూ.7.22 కోట్లు
✪ విరాట్ కోహ్లీ (భారత్): రూ.7 కోట్లు
✪ టిమ్ పైన్ (ఆసీస్): రూ.5 కోట్లు
✪ డీన్ ఎల్గార్ (దక్షిణాఫ్రికా): రూ.3.2 కోట్లు
✪ కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్): రూ.1.77 కోట్లు
✪ ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్): రూ.1.75 కోట్లు
✪ కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్): రూ.1.73 కోట్లు
✪ బాబర్ ఆజమ్ (పాకిస్థాన్): రూ.62 లక్షలు
✪ కరుణ రత్నే (శ్రీలంక): రూ.51 లక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement