Tuesday, April 30, 2024

అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య – మే 20నుంచి స్ట్రీమింగ్ !

అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంద‌ట‌. మెగాస్టార్ చిరంజీవి..రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. కాగా ఏప్రిల్ 29న ఆచార్య థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. నిరంజన్ రెడ్డి – అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే కథాకథనాల విషయంలోను .. సంభాషణల విషయంలోను ఎక్కడా కొరటాల మార్కు కనిపించకపోవడంతో అభిమానులు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి ఆటతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. తిరు ఫొటోగ్రఫీ కూడా అదనపు బలంగా నిలిచింది. చిరంజీవి – చరణ్ లపైనే పూర్తి దృష్టి పెట్టడం, పూజ హెగ్డే .. సోనూ సూద్ .. అజయ్ .. వెన్నెల కిశోర్ .. తనికెళ్ల భరణి న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement